Friday, November 22, 2024

మూడు గంట‌ల పాటు సోమిరెడ్డికి సిబిఐ అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

నెల్లూరు. నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్స్ చోరీ అయిన కేసులో భాగంగా టిడిపి సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి నేడు సీబీఐ అధికారుల ఎదుట హాజ‌రయ్యారు.. నెల్లూరు జిల్లా కార్యాల‌యలో ఆయ‌న‌ను సిబిఐ అధికారులు మూడు గంట‌ల పాటు ప్ర‌శ్నించారు.. న్యాయవాదితో పాటు విచారణకు హాజరైన సోమిరెడ్డి పెన్ డ్రైవ్‌తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అధికారులకు అందించారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని సీబీఐ సూచించింది. మరో వారంలో పిలుస్తామని, లిఖితపూర్వకంగా సమాధానాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సీబీఐ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ,మరోసారి తనని సీబీఐ అధికారులు విచారించారని తెలిపారు. పెన్ డ్రైవ్‌తో పాటు తొమ్మిది డాక్యుమెంట్లను అందించానన్నారు. కాకానికి గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన డాక్యుమెంట్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇచ్చానన్నారు. కాకాని పుణ్యమా అని తనకు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం కలిగిందని సెటైర్ వేశారు. ఈ కేసులో కాకానికి తప్పకుండా శిక్ష‌ పండుతుందని ఉద్ఘాటించారు. పరునష్టం దావాకు సంబంధించి తాను వేసిన రెండు కేసులు త్వరలోనే విచారణకు వస్తాయని ఆయన చేసిన మోసాలకు దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement