Tuesday, November 26, 2024

ప్రణాళికాబద్దంగా వార్డుల్లో అభివృద్ది

ఆత్మకూరు మున్సిపాలిటి పరిధిలోని అన్ని వార్డుల్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచనల మేరకు ప్రణాళికాబద్దంగా అభివృద్ది, మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ షేక్ సర్థార్ లు పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో కౌన్సిలర్ కొండా స్వరూపరాణి, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండా వెంకటేశ్వర్లుతో కలసి ముమ్మరంగా పర్యటించారు. వార్డుల పరిధిలోని సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 19వ వార్డులో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మాణాలకు ప్రణాళిక మేరకు మంత్రి మేకపటి గౌతమ్ రెడ్డి సహకారంతో అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు. మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకుల సహకారంతో మున్సిపాలిటిలో అన్ని అభివృద్ది పనులు చేపట్టనున్నామని, ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని కోారారు. వారి వెంట స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నా

Advertisement

తాజా వార్తలు

Advertisement