Friday, November 22, 2024

రాత్రి విగ్ర‌హాలు ధ్వంసం – ప‌గ‌లు వాటిపై ర‌చ్చ – తెలుగుదేశం తీరుపై అనిల్ ఫైర్

నెల్లూరు: ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందించాం కాబట్టే వైయస్‌ఆర్‌ సీపీకి ఓటు వేయాలని ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో లక్షల మెజార్టీతో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత జిల్లాలోనే టీడీపీకి దిక్కులేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ విగ్రహాలు ధ్వంసం చేసి.. ఉదయాన్నే రచ్చ చేస్తుందని, సాక్షాత్తు శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు మనుషులు నంది విగ్రహాన్ని ఎలా ఎత్తుకెళ్లారో ప్రజలంతా చూశారన్నారు. ఆ ఘటనపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలు కుమ్మకై మత రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి అనిల్‌ ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేసి 24 గంటలైనా టీడీపీ సమాధానం లేదు.. సవాల్‌ను స్వీకరించే దమ్ముందా.. లేకపోతే తోకముడిచామని ఒప్పుకోండి అని సూచించారు. సీఎం జగన్‌ సభ పెడితే లక్షలాది మంది జనం తరలివస్తారు. ప్రజారోగ్యం దృష్ట్యా తిరుపతి సభను సీఎం రద్దు చేసుకున్నారన్నారు. వ్యక్తిగత సిబ్బందికి కరోనా వస్తేనే పవన్‌ లోపల ముడుచుకొని కూర్చుంటే ఎవరూ మాట్లాడటం లేదు.. ఇదెక్కడి న్యాయం..? ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం సభను వాయిదా వేసుకుంటే కరెక్టు కాదు.. పవన్‌ చేసింది మాత్రం టీడీపీకి కరెక్ట్‌గా కనిపిస్తోందా..? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement