Tuesday, November 26, 2024

పెంచలకొన నవనార సింహ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

నవనార సింహ క్షేత్రాలలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం –పెంచలకొన,
రాష్ట్రవ్యాప్తంగా పెనుశీల లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక ఆదరణ,
కొండపై కొలువున్న భక్తులు కోర్కెలు తీర్చేదైవం,
కారోనా నేపథ్యంలో అంతాఏకాంత సేవలే,
భక్తులకు దూరంగా ఉత్సవాలు,

రాపూరు రూరల్ : తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాల్లో నెల్లూరు ,కడపజిల్లా ల మధ్య ఈ పెంచలకొన క్షేత్రం ఉంది ,నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో సముద్రం మట్టానికి మూడువేల అడుగున ఎత్తున ఈ క్షేత్రం నిత్య శోభాయమానంగా విరాజిల్లుతుoది ,ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యం లో ఉన్నపటికి ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు క్రీమికీటకాలగురించి కాని వేరే ఇతర ఏదైనా ఆపదలు తలెత్తిన దాఖలాలు లేవు,అందువల్ల ఈ పుణ్యక్షేత్రం లో కొలువై ఉన్న నారసింహ స్వామి ,వారిని కోండి కాసుల స్వామి గా పిలవడం నానుడి,కొన లోని గర్భగుడిని సుమారు 800 వ సంవత్సరాల పూర్వం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది, భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈప్రాంతంలోనే తిరిగాడాని ఆయనను పెంచిన కన్వ మహర్షి ఈ ప్రాంతం లొనే తప్పస్సు ఆచరించాడని ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కండలేరు గా చరిత్ర కథనం,పెంచలకొన కు ఆరుకీలోమీటర్ల దూరంలో ఉన్న గోనుపల్లి కి చెందిన ఓ గొర్రెల కాపరి తన గొర్రెల ను మేపుకొనేందుకు పెంచలకొన అడవిలోకి వెల్లగా స్వామివారు ఒక వృద్ధుడి రూపంలో గొర్రెల కాపరికి కనిపించి తాను పెనుశిల లక్ష్మీనరసింహస్వామి గా శి లా రూపంలో ఈ ప్రాంతం లో వెలసి ఉన్నానని ,ఈ విషయాన్ని గోనుపల్లి గ్రామస్తులు లకు తెలిపి తనకు ఆలయాన్ని ఏర్పాటు చేయాలని గొర్రెల కాపరికి స్వామి సూచిoచినట్లు పురాణం చెబుతోంది, ఐతే గొర్రెల కాపరి గోనుపల్లి గ్రామానికి వెళ్ళే సమయంలో వెనుకకు తిరిగి చూడరాదని స్వామివారు గొర్రెల కాపరికి ఆంక్ష పెట్టినట్లు నానుడి ,ఇందుకు అంగీకరించిన గొర్రెల కాపరి కొద్ధిదూరం వెళ్లిన తర్వాత స్వామివారు ఏంత ఆకలితో ఉన్నారో అని భావించిన ఆ గొర్రెల కాపరి వెనక్కు తిరగగా ఆ కాపరి వెంటనే అక్కడికక్కడే శిల గా మారినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు ,ఈ విషయం తెలుసుకొన్న గ్రామస్తులు స్వామివారి కి ఆలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది,1970 వ సంవత్సరం ఈ దేవస్థానం దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచలకొన పుణ్యక్షేత్రం దినదినాభివృద్ది చెందుతూ భక్తులు పాలిట కల్పవల్లి గా మారింది , నవ నారసింహ క్షేత్రాలలో ప్రసిద్ధి గాంచిన క్షేత్రం ఈ పెంచలకొన ,ఈ పెంచలకొన పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లాలో ఉంది ఐతే పుణ్యక్షేత్రం లో ఎక్కడ లేని విదంగా పెనుశీల లక్ష్మీనరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారు పెనవేసుకొని వుంటారు, కనుక ఈ క్షేత్రానికి పెనుకొన అని పేరు నుండి పెనుశిల కోన గా మారి కాలానుగుణంగా పెంచలకొన గా పిలవబడుతుంది ఈ కోన క్షేత్రానికి ఆలయం చుట్టుపక్కల కొండలతో బోగ్యం గా ఏంతో చూడముచ్చటగా ఉంటుంది, పెంచల స్వామి దేవస్థాననికి ఎదురుగా ఆంజనేయస్వామి తీరువడి ఉంది ,పెంచల స్వామి ఆలయానికి ఉత్తర బాగానా మరో ఆంజనేయస్వామి తిరువడి ఉంది ,ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానంలో ఎక్కడా ఎప్పుడు లేనటువంటి ఆంజనేయస్వామి వారి తోకకు గంట ఉంటుంది ,అలాగే ఆంజనేయస్వామి వారి పాదాల క్రింద రావణుని కుమారుడు అక్షయ కుమారుడిని తొక్కిపెట్టినట్లు వుంటుంది , , ఈ కోన క్షేత్రానికి ఆంజనేయస్వామి క్షేత్రపాలకునిగా వ్యవహరిస్తుoట్టారని భక్తులు విశ్వాసం ,కోన క్షేత్రం లో ఉన్న నరసింహస్వామి ,ఆంజనేయస్వామి ,ఆదిలక్ష్మి అమ్మ వారి ఆలయాలు నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ,ప్రహ్లాదుని సంరక్షణ నార్థం హిరణ్యకశిపుడు ని సంహరించిన తరువాత నరసింహ స్వామి ఉగ్రరూపం లో కళ్లారని కోపాగ్నితో అడవి ప్రాంతం అంతా భీకరంగా అరుస్తూ స్వామివారి వస్తుంటే చూసిన దేవతలు స్వామివారిని శాంతిపచేయడాని కి చేసిన ప్రయత్నాలు అన్ని ఫలించక పోవడంతో ఈ పరిస్థితి లో ఉన్న స్వామివారిని ఎలా శాంతపరచాలో తెలియక తలలు పెట్టుకొనే తరుణంలో లక్ష్మీ స్వరూపమైన చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారి ముంగిట నిలబడి నట్లు నానుడి, దీనితో ఉగ్రరూపుడైనా స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారి అంద చందాలు చూసి శాంత రూపంలోకి వచ్చిన తదనంతరం,చోటుచేసుకున్న పరిణామాలతో అమ్మవారిని మోహించి పెనవేసుకొని ఏక శిలా రూపం దాల్చి నట్లు పురాణం చెబుతోంది, అందువల్ల ఈ క్షేత్రానికి పెనిశిలా అని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది ,స్వామివారి శిలా రూపానికి ఒక కవచం ఏర్పాటు చేసి నీలబడివున్న స్వామివారి ముకానికి తోడిగిన కవచం కాళ్లకు రెండు వైపులా కూర్చున్న రీతిలో అమర్చబడి వున్నట్లు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు ,స్వామివారి నిజ రూపాన్ని చూడాలనుకునే భక్తులకు ప్రతి శనివారం తెల్లవారుజామున జరిగే పంచాంబృత అభిషేకాలు సమయంలో చూడవచ్చు ఈ అభిషేకం లో కొద్దిమంది కి మాత్రమే అనుమతి లభిస్తుంది ఐతె ఈ అభిషేకం ను దర్శించిన భక్తులకు తమతమ కోరిక పలిస్తుంది ,మిగిలిన రోజులలో శ్రీవారు కవచ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ,శ్రీ వారిని ఇల వేల్పు గా భావించే భక్త్తులు తమ పిల్లలను పెంచల అనే నామకరణం తో పిలుచుకొంటారు ,ప్రతి సంవత్సరం ,ఏప్రిల్ ,మే మాసాలలో శ్రీ వారి బ్రంహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది, ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి కళ్యాణం తో పాటు అనేకమంది భక్తులు కూడా వివాహాలు చేసుకోవడం జరుగుతుంది, కోన క్షేత్రం లో భక్తుల కొరకు టూరిజం శాఖ వారు మూడు కళ్యాణ మండపాలు టీటీడీ కళ్యాణ మండపం 150 గదులు ,దేవస్థానం ఆధ్వర్యంలో 250 గదులు,అన్ని కులాలకు చెందిన భోజన వసతి సత్రాలు భక్తులకు అందుబాటులో వున్నాయి, పుణ్యక్షేత్రా నికి నెల్లూరు జీల్లా నుండే కాకుండా అధికంగా రాయలసీమ ప్రాంతం నుండి కులమత వర్గ బేదాలకు అతీతంగా భక్తులు తరలివచ్చి స్వామివారి ని దర్చించు కొంటున్నారు , నెల్లూరు ,గూడూరు,వెంకటగిరి, రాపూరు, ఆత్మకూరు, కడపజిల్లా ప్రాంతాలనుండీ ప్రతి గంటకు ఆర్ టీ సి సర్వీసులు కోన పుణ్యక్షేత్రానికి అందుబాటులో ఉంచారు ,ప్రతి నెల క్రమంతప్పకుండా స్వాతి నక్షత్రం రోజున శ్రీ వారికి కి నిత్యo జరిగే సేవలన్ని ఈ కోన పుణ్యక్షేత్రం లో జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement