Thursday, November 7, 2024

ఘనంగా సాయినాధుని ప్రథమ వార్షికోత్సవం

వరికుంటపాడు : మండల కేంద్రమైన వరికుంటపాడు లో నిర్మించినటువంటి శ్రీ సాయినాధుని ఆలయంలో మంగళవారం సాయినాధుని ప్రథమ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు. సాయినాధునికి అభిషేకాలు పాలాభిషేకం పూర్ణహుతి తదితర అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సుంకర వెంకటాద్రి సుజనా దంపతులు, సుంకర ఆదిత్య అసృత ,దంపతులు సుంకర అంజనాద్రి విజయలక్ష్మి ,దంపతులు కదిరి వెంకటేశ్వరరావు సంపూర్ణ దంపతులు, దొడ్డ సుధాకర్ బాబు రమణి దంపతులు, డాక్టర్ మాటూరి ఆదిశేషయ్య అనంతలక్ష్మి దంపతులు, ఇస్రో వైస్ చైర్మన్ వాలా వెంకటేశ్వరరావు ధరణి దంపతులు, కదిరి రాజేష్ రమ్య దంపతులు హోమాలలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పూర్ణాహుతితో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి పూర్ణాహుతి హోమం నిర్వహించారు.

ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత కనిగిరి మాజీ శాసన సభ్యులు ప్రస్తుత కావలి వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు కదిరి బాబురావు, కదిరి ప్రకాష్ రావు, కదిరి పార్థసారథి, బోయిడి ప్రసాదు, నాయుడు ప్రకాష్ , నెల్లూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ చండ్రా మధుసూదన్ రావు, వైసీపీ జడ్పిటిసి రావెళ్ల నాగేంద్ర ,వైసిపి మండల కన్వీనర్ ఆండ్రా బాల గురువారెడ్డి, బిగ్బాస్ ఆదిరెడ్డి, సుంకర రాధాకృష్ణ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేక రథంపై పురవీధులలో ఊరేగింపుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రికి స్వామి వారి పల్లకి సేవ, ఊయల సేవ, హారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కాకినాడ వారిచే కోలాట కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే రాత్రికి ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement