Wednesday, November 20, 2024

ప్రజలకు అందుబాటులోకి 10 కేజీల సిలిండర్

బుచ్చిరెడ్డిపాలెం : కృష్ణ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ప్రజలకు 10 కేజీల సిలిండర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం వారు బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో 10కేజీల సిలిండర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు సంయుక్తంగా ఆమోదించిన పది కేజీల ఫైబర్ సిలిండర్ అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనిని బరువు తక్కువ ప్రమాదాల రహితంగా తయారు చేయడం జరిగినట్లు వారు తెలిపారు. సిలిండర్ పేలే అవకాశం లేదన్నారు.

బరువు తక్కువగా ఉండడంతో మహిళలు సునాయాసంగా ఇంట్లో పెట్టుకోవచ్చన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో తయారుచేసిన సిలిండర్ తుప్పు పట్టదని, ఎన్నేళ్లయినా నాణ్యతగా ఉంటుందని తెలిపారు. సిలిండర్ కావాల్సిన వారు రూ. 3,500 చెల్లించి పొందవచ్చునన్నారు. 14 కేజీల సిలిండర్ ఉన్నవారు వారు డిపాజిట్ మినహాయించుకొని నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మహిళలకు అత్యంత భద్రత కలిగించేలా సిలిండర్ ను తయారు చేయడం జరిగిందన్నారు. ఫోన్ గూగుల్ పే సౌకర్యం సైతం వినియోగదారులు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 10 కిలోల సిలిండర్ గ్యాస్ పొదుపు చేసేందుకు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ మెకానిక్ శ్రీహరి డెలివరీ బాయ్ బాబు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement