Monday, July 8, 2024

Nellore – పెద్దపులి, చిరుత సంచారం.. భ‌యం భ‌యం!


ఆంధ్రప్రభ స్మార్ట్, మర్రిపాడు:
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కదిరినాయుడు పల్లి పడమరగా పెద్ద బావి ప్రాంతంలో పెద్దపులి, చిరుత పులి రెండు సంచరిస్తున్నాయని మర్రిపాడు డిప్యూటీ రేంజ్ అధికారి రవీంద్ర వర్మ విలేకరులకు తెలిపారు. జిల్లా ఫారెస్ట్ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఇటీవల కదిరి నాయుడుపల్లి జాతీయ రహదారి కారుపై జరిగిన పులి దాడిఘటన తెలిసిందే. ఫారెస్ట్ అధికారులు అడవిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి బేస్ క్యాంప్, స్టైకింగ్ ఫోర్స్ సిబ్బంది ని అధిక సంఖ్యలో ఏర్పాటు చేశారు. అడవికి సమీపంలోని గ్రామాల ప్రజలనుఅడవుల్లోకి రాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇక సీసీ కెమెరాల వైపు ఉన్నత అధికారులు మినహా ఎవరు వెళ్లకుండా వన్యప్రాణుల సంచారానికి ఇబ్బంది కలగ కుండా చూస్తున్నారు.

సీసీ ఫుటేజీ ప‌రిశీల‌న‌..

ఇటీవల రెండు రోజుల కిందట కావలి ఫారెస్ట్ సబ్ డీఎఫ్ఓ రాజశేఖర్ సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించి పెద్దపులి, చిరుత పులి అడవిలో సంచరిస్తున్నాయని ఫారెస్ట్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆత్మకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి శేఖర్ నేతృత్వంలో అడవి సమీప ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఆర్ఓ రవీంద్ర వర్మ వెల్లడించారు అడవిలోకి జీవాలతో కాపర్లు, ప్రజలు ఫారెస్ట్ అధికారుల అనుమతి లేకుండా వెళ్లరాదని అలా నిబంధనలు దిక్కరించిచట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement