Wednesday, November 6, 2024

Nellore: వైసీపీకి నెల్లూరు మేయర్ రాజీనామా..

వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వారు వెల్లడించారు. శ్రీధర్ రెడ్డి వల్లే మేయర్ పదవి వచ్చిందని, అధికార పార్టీ బెదిరింపుల వల్లే అప్పుడు పార్టీని వీడామని వారు తెలిపారు.

నెల్లూరు మేయర్ స్రవంతి మాట్లాడుతూ.. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ఆమె చెప్పారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్‌ను శ్రీధర్ రెడ్డి ఇచ్చారన్నారు. అంతేకాకుండా మేయర్‌ను చేశారన్నారు. మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని.. రాజకీయాల్లో తనకు ధైర్యాన్ని ఇచ్చారన్నారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కూడా ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశామన్నారు. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైసీపీలోకి వెళ్ళాల్సి వచ్చిందన్నారు.

శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు ఒత్తిడి తెచ్చారన్నారు. శ్రీధర్ రెడ్డి ఒక్క‌ మాట కూడా మాట్లాడలేదన్నారు. మా తప్పులను శ్రీధర్ రెడ్డి మన్నించి మమ్ములను అక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నామన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో ఫోర్జరీ ఆరోపణల విచారణ చేయిస్తామన్నారు. తన భర్త జయవర్ధన్‌కు పాత్ర ఉందని ప్రచారం చేయడం సరికాదని.. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మేయర్ స్రవంతి పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement