విజయనగరం : నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కళాశాల సెకండియర్ విద్యార్థి సాయిమణిదీప్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గది తలుపులు తెరుచుకోకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులు తెరిచి చూడగా సాయిమణిదీప్ అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు.
వారు వెంటనే మిమ్స్ యాజమాన్యానికి సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎంబీబీఎస్ సెకండియర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో సాయిమణిదీప్ మానసికంగా కుంగిపోయాడని ఎస్‌ఐ తెలిపారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిమణిదీప్… పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు.