Friday, November 22, 2024

AP | జూనియర్ డాక్టర్లతో చర్చలు సఫలం..

కర్నూలు బ్యూరో : ఆప్ జూడా ప్రతినిధులు రక్షణ, ఇతర సదుపాయాల గురించి వెలిబుచ్చిన సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ కె.ఎం.సి డాక్టర్ కే.చిట్టి నరసమ్మ, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డిలు అన్నారు.

శనివారం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో ఆప్ జూడాల ప్రతినిధులు ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్స్, ఆర్.ఎం.ఓ. ల ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కార్యాలయంలో సిసి కెమెరాలు, విద్యుద్దీకరణ, విశ్రాంతి గదులు, వివిధ సమస్యలపై ఆప్ జూడా ప్రతినిధులు నివేదించారు. కాగా, ఈ సమస్యలపై స్పందించిన ప్రిన్సిపల్, సూపరింటెండెంట్లు మాట్లాడుతూ…

ఎలక్ట్రిషన్ సంబంధించి వారం రోజుల్లో అదనపు లైట్లు, 15 రోజుల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు, అదేవిధంగా రెస్ట్ రూములకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అవకాశాలతో సర్దుబాటు చేసి శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి నివేదికలు పంపి అనుమతులు లభించిన వెంటనే వాటిని కూడా పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఏవైనా సమస్యలుంటే ముందుగా ప్రిన్సిపాల్ & సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ హరి చరణ్, డాక్టర్ రేణుక, డాక్టర్ సాయి సుధీర్, డిప్యూటీ సీఎస్‌ఆర్‌వో, డాక్టర్ హేమనాలిని ఆర్.ఎం.ఓ డా.వెంకటరమణ హాస్టల్ ఇంచార్జి డాక్టర్ వి.శ్రీలత, సిఎస్ కె ప్రకాష్, జూడాల ప్రతినిధులు డాక్టర్ సాయి సుధీర్, సునీల్, మనోజ్, వర్షిణి, భావన, అఖిల, మాధవరెడ్డి, దివ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement