Friday, September 20, 2024

Kadapa: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. పిల్లలకు ప్రాణసంకటం

బద్వేల్ (కడప)- ప్రభ న్యూస్ : కడప జిల్లా అట్లూరు మండలం పెద్దకామసముద్రం ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యుత్ స్తంభాలు పొర్ల‌డంతో విద్యార్థుల‌కు గాయాల‌య్యాయి. గ్రామంలో విద్యుత్ లైన్ పనుల కోసం విద్యుత్ సిమెంటు స్తంభాలను నిర్లక్ష్యంగా నిలువ చేశారు. పాఠశాల కాంపౌండ్ పక్కనే ఉండటం వల్ల బుధవారం పాఠశాల లోపలికి వెళ్తున్న స్కూలు పిల్లలు ఆడుకుంటూ వాటిపైకి ఎక్కారు.

దీంతో ఆ విద్యుత్ స్తంభాలు పొర్లడంతో ఐదుగురు విద్యార్థులు గాయాల పాలయ్యారు. వారిలో ఐదవ తరగతి చదువుతున్న 10 సంవ‌త్సరాల బాలిక గద్దె స్రవంతి కాలువిరగగా మిగతా నలుగురికి మిద్దెల ప్రతీక(9), రిత్విక(9), రోషన్(6), మిద్దెల రుషికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే చికత్స నిమిత్తం బద్వేల్ కు తరలించారు.

స్కూలు టీచర్లు, సిబ్బంది, విద్యుత్ అధికారులు, విద్యుత్ పనులు చేపట్టిన గుత్తేదారుడి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సమాచారం తెలుసుకున్న అట్లూరు ఎస్సై కేసీ రాజు సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement