Sunday, November 17, 2024

Nandyala | వైద్య విధుల్లో అలసత్వం.. ఐదుగురిపై వేటు !

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని డోన్ మండలం కొత్త‌బురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జి.రాజ కుమారి ఆదివారం తెలిపారు.

ఈనెల 16వ తేదీన డోన్ మండలం కొత్త బురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన సి.నీలిమ, ఎఫ్ఎన్ఓ, మరియు డి. నాగరాజు, తోటిలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

అలాగే, ఎలాంటి సెలవులు, ముందస్తు అనుమతి లేదా నోటీసు లేకుండా విధులకు హాజ‌రుకాని… ఎం.అన్నపూర్ణ, స్టాఫ్ నర్స్, బి.రేఖ, ఫార్మసిస్ట్, గ్రేడ్-2, ఎం.శంకరమ్మ, సీనియర్ అసిస్టెంట్ ఇలా మెత్తం ఐదుగురు వైద్య ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన‌ట్లు కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement