Thursday, November 21, 2024

NEET PG – ఆగ‌స్ట్ 11న నిట్ పిజి ప‌రీక్ష

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ నీట్-పీజీ పరీక్ష తేదీని ప్రకటించింది. నీట్ పీజీ పరీక్ష ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా.. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరగనుంది. నీట్ పీజీ పరీక్షలు 23వ తేదీన ఉదయం 10:30 గంటలకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే పరీక్షకు ఒక రోజు ముందు ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్షా ప్రక్రియ, పటిష్టతను తనిఖీ చేసి, ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందకే రద్దు చేసినట్లు ఎన్బీఈ ఛైర్మన్ డాక్టర్ అభిజాత్ సేథ్ తెలిపారు. ఎన్‌బీఈ గత ఏడేళ్లుగా నీట్‌-పీజీని నిర్వహిస్తోందని.. బోర్డు కచ్చితమైన ఎస్‌ఓపీ కారణంగా పేపర్ లీక్ అయినట్లు ఎలాంటి నివేదిక రాలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement