Thursday, October 17, 2024

Neerb Kumar – సిఎస్ గా ఇలా బాధ్య‌తలు …అలా ఐఎఎస్ ల బ‌దిలీలు

ఆంధ్రప్రదేశ్‌ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్ ప్రసాద్. ఈ సందర్భంగా కొత్త సీఎస్‌ను ఆశీర్వదించారు టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వేద పండితులు. ఇక, కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు వివిధ శాఖల అధికారులు ఈ సందర్భంగా నీరభ్‌ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. సీఎస్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న‌ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.. సహచర అధికారులు సిబ్బందితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు త‌న‌ వంతు కృషి చేస్తానని వెల్లడించారు.. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా తన పని ఉంటుంది.. మంచి చేసేలా కృషి చేస్తాను అన్నారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తాను అన్నారు.

బ‌దిలీల పర్వం ప్రారంభం

జగన్ పేషీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ భరత్ గుప్తాలను బదిలీ చేసింది ప్రభుత్వం. వీరంతా జీఏడీలో రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement