Tuesday, November 26, 2024

వరదలో చిక్కుకున్న ఏడుగుర్ని రక్షించిన NDRF బృందాలు

చేపలు పట్టేందుకు వెళ్లి ధర్మవరం చెరువుకట్టపై నిలిచిపోయిన ఏడుగుర్ని పోలీసులు, NDRF బృందం కాపాడింది. ధర్మవరం ఎమ్మెల్యే పంపిన మరపడవ ద్వారా సురక్షితంగా ఏడుగుర్ని తరలించారు. ధర్మవరం శివార్లలోని చిన్నూరుకు చెందిన ఏడుగురు శుక్రవారం చేపలు పట్టేందుకు ధర్మవరం చెరువుకు వెళ్లారు. వరద నీటి ఉధృతి పెరగడంతో చెరువుకట్టపై నిలిచిపోయారు. ఎటూ రాలేసని పరిస్థితులు ఏర్పడింది. ఈ విషయం డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న ధర్మవరం పోలీసులు.. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎస్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగారు. రెస్క్యు ప్రయత్నం చేశారు ఫలించలేదు. దీంతో అక్కడే ఉండిపోయారు. దీంతో ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మళ్లీ రెస్క్యు ఆఫరేషన్ ప్రారంభంది.

ఈ విషయం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దృష్టికి వెళ్లడంతో స్పందించి మర పడవను పంపారు. స్వయాన ఎమ్మెల్యే సోదరుడు, ధర్మవరం డీఎస్పీ ఆధ్వర్యంలో సి.ఐలు రెస్క్యు ఆపరేషన్ లో పాల్గొని మరపడవ ద్వారా ఏడుగుర్ని సురక్షితంగా తరలించారు. వైద్య బృందంచే పరీక్షలు చేయించి వారికి బ్రెడ్లు అందజేశారు. అనంతరం ఆసుపత్రికి తీసికెళ్లారు. వారి ఆరోగ్యం ఇబ్బందేమి లేదని డాక్టర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement