బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పక్ష నేతగా ప్రధాని మోదీని ఎన్నుకున్నారు. బుధవారం ఢిల్లీలోని మోదీ నివాసంలో ఎన్డీయే పార్టీల నేతల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ) లిఖిత పూర్వకంగా మద్దతు ఇచ్చాయి. మద్దతు లేఖలపై మరో 19 పార్టీ ల నేతలు సంతకాలు చేసారు. ఆ లేఖను దీంతో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎన్డీయే నేతలు అందివ్వ నున్నారు
.జూన్ 8న మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు ఎన్డీయే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనున్నది. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ నేతలు లల్లన్ సింగ్, సంజయ్ ఝా, బీహార్‌లో ఎన్డీయే కూటమికి చెందిన చిరాగ్ పాశ్వాన్, మాంఝే, జేడీ(ఎస్) నేత కుమారస్వామి, సీఎం షిండే తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని మోదీని నితీశ్ కుమార్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం వద్దని ఎన్డీయే మీటింగ్‌లో ఆయన అన్నారు.