Friday, November 22, 2024

NCBN Demand – అంగన్‌వాడీ కార్యకర్త హనుమాయమ్మ హత్యపై సీబిఐ విచారణ

అమరావతి: -ప్రకాశం జిల్లా రావివారిపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్తగా సవలం హనుమాయమ్మ హత్యపై ఏపీ డీజీపీ సహా పలువురికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. దళిత మహిళ హత్యపై జోక్యం చేసుకోవాలని నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్‌కు లేఖలు రాశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం, బడుగువర్గాల హక్కులు హరించబడుతున్న విధానంపై లేఖల్లో వివరించారు. హనుమాయమ్మ హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోరారు. హత్య ఘటనలో వైసీపీ నేతలకు పోలీసుల సహకారంపైనా విచారణ జరగాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న హనుమాయమ్మ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వడంతో పాటు ఆమె కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే తప్ప జగన్ కు పొద్దు గడవదు..

ప్రతి రోజూ టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేస్తేనో, అడ్డుకుంటేనో తప్ప ఈ ప్రభుత్వానికి పొద్దు గడవడం లేదు. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. .” నిన్న ప్రకాశం జిల్లాలో దళిత ఎమ్మెల్యే స్వామి గారిని అరెస్ట్ పేరుతో హింసించిన పోలీసులు… నేడు దళితుల భూముల రక్షణ కోసం పోరాడుతున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు గారిని అరెస్ట్ చేసి వేధించారు. ప్రభుత్వం అంటే ప్రశ్నించే గొంతులను నిర్బంధించడం కాదని ఈ నియంతృత్వ పాలకులు తెలుసుకోవాలి. అక్రమాలు చేసే వైసీపీ నేతలకు….అక్రమాలపై పోరాటం చేసే టీడీపీ నేతలకు మధ్య ఉన్న వ్యత్యాసం ప్రజలు అర్థం చేసుకున్నారు. మున్ముందు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న @RamanaiduTDP గారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను” అని ట్వీట్ లో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement