Tuesday, November 26, 2024

15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. 19 న గరుడసేవ, 20న పుష్పక విమానం

తిరుమల, ప్రభ న్యూస్‌ : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి 23 వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. చాంద్రమాసం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వీయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ రెండు బ్రహ్మోత్సవాలకు పెద్ద తేడా లేదుగాని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా ఈనెల 19 న గరుడవాహనం, 20న పుష్పకవిమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం జరగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడసేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement