Thursday, January 23, 2025

KNL | ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు..

కర్నూల్ బ్యూరో : కర్నూలు జిల్లా కర్నూల్‌ మండలం బి.తంద్రపాడులోని క్రెడో స్కూల్‌ లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాలు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌ శాంతకుమారి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. క్రెడో స్కూల్‌లో రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ ఐ బి డ్రైవర్లు అటెండర్లు, పాఠశాల సిబ్బంది హాజరయ్యారు. పిల్లల బస్సు భద్రత, డ్రైవర్ల క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలపై సూచనలు ఇచ్చారు. విద్యార్థులను ఇంటి నుండి పాఠశాలకు, పాఠశాల నుండి నివాసానికి తీసుకెళ్లడానికి, భద్రతను గూర్చి సూచనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మోటార్‌ వెహికల్ ఇన్ స్పెక్ట‌ర్లు ఎస్‌ నాగరాజ నాయక్‌, ఎం వి.సుధాకర్‌ రెడ్డిలు మాట్లాడుతూ… జనవరి 16నుండి ఫిబ్రవరి 15వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులు, ప్రజలు, విద్యార్థులను భాగస్వామ్యం చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపకూడదన్నారు. మోటార్‌ సైకిల్‌ నడుపుతున్నప్పుడు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. రాష్‌ డ్రైవింగ్‌, అధిక వేగం అత్యంత ప్రమాదకరమన్నారు. వాహనదారులకు అవగాహన కల్పించారు.

- Advertisement -

ముఖ్యంగా సెల్‌ ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు డ్రైవింగ్‌ చేయడం ఎంతో ప్రమాదకరమన్నారు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్‌ బెల్ట్‌ ను ధరించడం దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణించరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోటార్‌ వెహికల్ ఇన్ స్పెక్ట‌ర్లు ఎస్‌.నాగరాజ నాయక్‌, ఎం.వి.సుధాకర్‌ రెడ్డి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్ ఇన్ స్పెక్ట‌ర్లు వి.బాబు కిషోర్‌, ఎన్‌.గణేష్‌ బాబు, ట్రాన్స్ పోర్ట్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు చలపతి, వి.విజయ భాస్కర్‌, హౌమ్ గార్డులు. డైరెక్టర్‌ ఎస్‌.బి.కార్తీక్‌ కుమార్‌, స్కూల్‌ ఇంచార్జ్‌. కె. ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement