అహింస..సత్యమే సాధనంగా సాగిన మన పోరాటం ప్రపంచమానవాళికే మహోన్నత చరిత్రగా నిలిచిందన్నారు సీఎం జగన్. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న సీఎం.. జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ..మితవాదం, విప్లవాదం.. ఇలా వాదమేదైనా మనందరి గమ్యం ఒక్కటేనని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
జాతీయ జెండా మనందరి స్వాతంత్ర్యానికి, ఆత్మగౌరవానికి, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక అని కొనియాడారు. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా కోట్లాదిమంది భారతీయుల గుండె అని అభివర్ణించారు. ఈ 75 సంవత్సరాల్లో దేశం తిరుగులేని విజయాలు సాధించిందన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో నేడు మన దేశం మూడో స్థానంలో ఉందన్నారు. 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలుగుతున్నామని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
జాతీయ జెండా మనందరి ఆత్మగౌరవానికి ప్రతీక-సీఎం జగన్
Advertisement
తాజా వార్తలు
Advertisement