ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దరు పెట్రోల్ డీజిల్ లపై టాక్స్ రూపంలో ప్రజలను లూటీ చేస్తున్నారనీ పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ డీజిల్ ధరల పై సుమారు 30నుండి50 రూపాయల వరకు తగ్గించవచ్చని తెలిపారు..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జన జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభమవుతుందని, ఎన్నికలు ఉన్నచోట ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తామన్నారు. 15 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.