Saturday, November 23, 2024

విజయవాడలో నేరేడ్కో ప్రాపర్టీ షో.. ఈనెల 23, 24, 25 తేదీల్లో నిర్వహణ

అమరావతి, ఆంధ్రప్రభ: నిర్మాణ రంగానికి చెందిన సమస్త సమాచారాన్ని వినియోగదారులకు ఉచితంగా అందించేందుకు విజయవాడ నగరంలో నేరేడ్కో ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు- నేరేడ్కో విజయవాడ చాప్తర్‌ అద్యక్షులు బి అమర్నాద్‌ శనివారం వెల్లడించారు. ఈ సందర్బగా అమర్నాద్‌ మాట్లడుతూ ఈనెల 232425 తేదిల్లో విజయవాడ నగరంలో వున్న శేషసాయి కల్యాణ మండపంలో నేరేడ్కో ప్రాపర్టి షో జరుగనుందన్నారు. రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి ఆదిములపు సురేష్‌ ఈ ప్రాపర్టీ షోను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.

నిర్మాణ రంగంలో ఉన్న అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, గృహనిర్మాణ వినియోగ సామాగ్రి అమ్మకందారులు వినియోగదారులకు ఉచితంగా సమాచారాన్ని అందించేందుకు ఉంటారన్నారు. అన్ని తరగతులవారికి అనువైన గృహాలను అందించే బిల్డర్లు ఈ సారి ప్రాపర్టీ షో ప్రత్యేకతన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియొగం చేసుకొని ప్రయోజనాలు పొందాలని అమర్నాద్‌ కోరారు. నగరంలో నేరేడ్కో ప్రాపర్టీ షో ఆహ్వన పత్రికలను అయన నేరేడ్కో విజయవాడ చాప్తర్‌ ప్రధానకార్యదర్శి జి. హరి ప్రసాదరెడ్డితో కలిసి అవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement