తమకు అధికారం ఇస్తే రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తామన్న బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శలు గుప్పించారు. సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా అర్థం కావడం లేదన్నారు. చీప్ లిక్కర్ ఇచ్చి ప్రజలను సంతోషపెడతానని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. సోము వీర్రాజు లాంటి వ్యక్తులను పార్టీలో పెట్టుకుంటే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి ఎందుకొచ్చారో అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ ఓ సింహం అని, ఎంతమంది వచ్చినా ఒంటరిగానే పోరాడతారని నారాయణ స్వామి స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..