ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయాలని కోరారు. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఇటీవల వర్సిటీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పడ్డ పరిరక్షణ సమితి చలో వర్సిటీకి పిలుపునిచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ మరో వర్గం ఆందోళనకు పిలుపునివ్వడంతో వర్సిటీ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పలువురు విద్యార్థి సంఘాల నాయకులను, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీనిపై నారా లోకేష్ గవర్నర్ కు లే రాశారు. వైసీపీ పాలనలో వర్సిటీలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని పేర్కొన్నారు. వీసీ నిత్యం వివాదాస్పద నిర్ణయాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. వీసీ ప్రసాద్‌రెడ్డి ఆంధ్ర వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని అన్నారు. వర్సిటీని అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారుస్తున్నారని లేఖలో వివరించారు. వీసీని రీకాల్ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital