Saturday, November 23, 2024

ఆడపిల్లకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాః నారా లోకేశ్ ప్రతిజ్ఞ

అన్నా చెల్లెళ్ళ ప్రేమానుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు రక్షణగా నిలిచి, గౌరవించే తత్వాన్ని సొంత కుటుంబం నుంచే అలవాటు చేసే ఉత్తమ సాంప్రదాయానికి రాఖీ పౌర్ణమి ప్రతీక అని ఆయన అన్నారు. తోడబుట్టిన అక్కాచెల్లెళ్లకే కాకుండా సమాజంలో ఎదురయ్యే ప్రతి మహిళకు అన్నగా నిలవడం అందరి బాధ్యత అని చెప్పారు. ఇది మనందరి కర్తవ్యం అని భారతీయ సంస్కృతి చెపుతోందని చెప్పారు. కానీ ఈరోజు గౌరవప్రదమైన మంత్రి, ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్నవారు కూడా మహిళలతో దారుణంగా మాట్లాడుతున్నారని… ఇది చాలా దురదృష్టకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇకపై ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా ఒక అన్నగా స్పందిస్తానని స్పష్టం చేశారు. ఉన్మాదుల దుశ్చర్యలకు బలైపోయిన ప్రతి ఆడపిల్లకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తానని లోకేశ్ ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement