Saturday, November 23, 2024

అంబేద్కర్ కు నారా లోకేష్ నివాళులు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈసందర్భంగా గుడిపాడు క్యాంప్ సైట్ వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నారా లోకేష్ నివాళులర్పించారు. కార్యక్రమంలో డోన్ టీడీపీ ఇంఛార్జ్ సుబ్బారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు పాల్గొన్నారు.

నారా లోకేష్ ను కలిసిన హనుమంతురాయుని పల్లి గ్రామస్తులు :
నారా లోకేష్ ను డోన్ నియోజకవర్గం, హనుమంతురాయునిపల్లి గ్రామస్తులు కలిశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయంలో నష్టాలు చూస్తున్నామని డోన్ నియోజకవర్గం, హనుమంతురాయునిపల్లి గ్రామస్తులు శుక్రవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరువు మండలాలకు పరిహారం అందడం లేదన్నారు. గతంలో పంటబీమా, ఇన్ పుట్ సబ్సిడీ, కరువు చెక్కులు వచ్చేవన్నారు. గ్రామంలో ఉన్న నీటి సమస్య దృష్ట్యా చెరువు ఏర్పాటు చేయాలని కోరారు. త‌మ సమస్యలను పరిష్కరించి, గ్రామ రూపురేఖలు మార్చాలని లోకేష్ ను కోరారు. నారా లోకేష్ మాట్లాడుతూ… కరువు పరిస్థితులు అంచనా వేసి గతంలో మండలాల వారీగా అదనంగా పనిదినాలు కల్పించామ‌న్నారు. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే రైతులకు బీమా సొమ్ము అందించారన్నారు. ఇన్ పుట్ సబ్సీడీ ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. హనుమంతురాయునిపల్లిలో ఎన్ఆర్జీసీ నిధులతో చెరువు ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement