రోడ్డు ప్రమాదంలో రాజావర్ధన్‌రెడ్డి చనిపోవడం బాధకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు మాజీ ఎంపీపీ రాజావర్ధన్ కుటుంబీకులను ఆయన పరామర్శించారు. కర్నూలు నెహ్రు నగర్ లో ఇంటికి వెళ్లి రాజా వర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజా వర్ధన్ రెడ్డి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులను నారా లోకేష్ ఓదార్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మంచి టీడీపీ యువ నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆయన సొంత పనుల కోసం తనను కలవలేదన్నారు. ఎప్పుడు ప్రజల పనుల కోసమే తపించేవారన్నారు. రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగినా.. ఒక ఐటీ ప్రొఫెషనల్‌గా ఉన్నత స్థాయికి ఎదిగి పదేళ్లు బాగా కష్టపడి.. తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కర్నూలు రూరల్ ఎంపీపీగా పోటీ చేసి గెలుపొందారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాజ్వర్ధన్రెడ్డి తనను కలిసినా.. ఏనాడు వ్యక్తిగత పనులు, కాంట్రాక్టుల గురించి మాట్లాడలేదన్నారు. చాలా చిన్న వయసులోనే కన్నుమూశారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను నారా లోకేశ్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement