Thursday, November 21, 2024

వ్యాక్సిన్ కంపెనీపై కుల రాజకీయాలా?

సీఎం జగన్‌రెడ్డి పాలన వల్ల ఏపీ అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద్శి నారా లోకేష్‌ అన్నారు. థర్డ్‌వేవ్‌ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశాయని, వైసీపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ విషయంలో అలసత్వం వహిస్తోందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 18 ఏళ్ళు పైబడిన వారికి ఒక్క డోసు 40 శాతం, రెండు డోసులను 16 శాతం మందికి వేసి దేశంలోనే అట్టడుగుస్థానంలో ఉందన్నారు. వ్యాక్సిన్‌ కంపెనీపై ప్రభుత్వం కుల రాజకీయాలు మానుకొని.. థర్డ్‌ వేవ్ హెచ్చరికలపై అప్రమత్తమవ్వాలని నారా లోకేష్‌ సూచించారు. ఎవరెలా చస్తే నాకేంటి తాడేపల్లి కొంపలో నేను హాయిగా నిద్రపోతే చాలు అన్నట్టు సీఎం జగన్ వ్యవహార శైలి ఉందని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement