గుంటూరు జిల్లా పెదనందిపాడులో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో టీడీపీ చంద్రబాబుని దూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించిన దళితుడైన వెంకటనారాయణపై మద్యం సీసాలతో కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను రాక్షసమూకల చర్యలగా అభివర్ణించారు. తప్పుని తప్పని చెబితే చంపేస్తారా? అంటూ మండిపడ్డారు. మంచి చెప్పే మనుషుల ప్రాణాలే తీసేస్తారా? అని ప్రశ్నించారు. నిన్న ఒంగోలులో వైశ్యుడైన సొంతపార్టీ నేత సుబ్బారావు గుప్తా, నేడు వెంకటనారాయణ.. రోజుకొకరు వైసీపీ పిశాచముఠాలకి బలవ్వాల్సిందేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తోందనేది సుస్పష్టం అవుతోందని అన్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులేమయ్యారు? అని నారా లోకేష్ ప్రశ్నించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital