వైసీపీ ప్రభుత్వం పెంచిన పన్నులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ మాటలు వింటుంటే గాలి పీల్చినా… వదిలినా పన్ను వేసేలా ఉన్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ‘కాదేది బాదుడే బాదుడుకు అనర్హం’ అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. సామాన్యుడిపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయలు కొట్టేసే విధానాలకు జగన్ ఇకనైనా స్వస్తి పలకాలని లోకేశ్ హితవు పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement