Thursday, November 21, 2024

ఇదీ మన ఏపీ పోలీసుల దుస్థితిః నారా లోకేష్

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో చెప్పడానికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ ఉదంతం తాజా ఉదాహరణ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆయనను ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారంటే అధికార పార్టీకి కొంత మంది పోలీసులు ఎంతగా ఊడిగం చేస్తున్నారో అర్ధమవుతుందన్నారు. కార్యకర్త ఇంట కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్లిన చింతమనేనిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గంజాయి అక్రమ రవాణా జరిగే ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగినందుకు అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపుకి పోలీసు వ్యవస్థ ఆయుధంగా మారిందని ఆరోపించారు. చింతమనేని అక్రమ అరెస్ట్‌ని  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆయన్ని విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. వైసీపీ కండువా కప్పుకొని అత్యుత్సాహంతో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న కొంతమంది పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement