వైసీపీ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విరుచుకుపడ్డారు. ‘’సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్ ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు తన చీప్ లిక్కర్ అమ్మే మద్యం దుకాణాల ముందు డ్యూటీ వేసిన వైఎస్ జగన్ ని ఏం చెయ్యాలి? నడిరోడ్డు మీద ఉరి తియ్యాలా?’’ అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్.నాయుడు గారిని సస్పెండ్ చెయ్యడాన్ని నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా వ్యవహరిస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్చని వైసీపీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. మాస్టారిపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలి అని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుందని నారా లోకేష్ స్పష్టం చేశారు.
భావవ్యక్తీకరణ స్వేచ్చని జగన్ సర్కార్ హరిస్తోంది
By mahesh kumar
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- ap latest news
- AP Nesw
- AP NEWS
- ap news today
- AP politics
- CM JAGAN
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- tdp leader nara lokesh
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- ysrcp government
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement