Friday, November 22, 2024

ఎన్నికల వ్యవస్థ అంగడి సరుకా? : సీఎం జగన్ పై లోకేష్ విమర్శ

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే… ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో జగన్ ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని జ‌గ‌న్‌రెడ్డి న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారని విమర్శించారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్ల‌ని అరెస్టు చేసిన పోలీసులు… దొంగ ఓట్లు వేసేందుకు ఇత‌ర‌ ప్రాంతాల నుంచి వైసీపీ తీసుకొచ్చిన వారిని కుప్పం వరకు ఎలా రానిచ్చారని ప్రశ్నించారు. వైసీపీ వాలంటీర్లే దొంగ ఓట‌ర్ల‌ని బూత్‌ల‌కు తీసుకొస్తుంటే, ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తోందని నిలదీశారు.

పోలీసుల ముందే దొంగ ఓట‌ర్లు కాలరెగ‌రేసుకుని వెళ్తూ ఓటేసి వ‌స్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌గ‌న్ అరాచ‌క‌ పాల‌న‌, పెరిగిన ధ‌ర‌లు, పెంచిన ప‌న్నులు, అధ్వాన్నపు రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్ర‌హంగా వున్న ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ఓట్లు వేస్తే దారుణ ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుసుకున్న జ‌గ‌న్‌రెడ్డి డెమోక్ర‌సీ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గాల్సిన ఎల‌క్ష‌న్‌ని ఫ్యాక్షనిస్టు క‌నుస‌న్న‌ల్లో జ‌రిగే సెల‌క్ష‌న్ గా మార్చేశారని లోకేష్ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement