తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇవాళ లోకేష్ యువగళం పాదయాత్ర 210వ రోజును పొదలాడలో కొనసాగించి, రాత్రికి అమలాపురం నియోజకవర్గంలో బస చేస్తారు. గతంలో పాదయాత్రలో లోకేష్ 2852.4 కి.మీ.నడిచారు.
మొదటి రోజు మధ్యాహ్నం పి.గన్నవరం నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకుంటారు. నగరంలో గెయిల్, ఓఎన్‌జీసీ బాధితులతో నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. మామిడికుదురులో స్థానికులతో సమావేశమవుతారు. అటుపై 2.45కి పాశర్లపూడిలో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం లోకేష్ పాదయాత్ర పాశర్లపూడి నుంచి కొనసాగుతుంది. అనంతరం అప్పనపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశమవుతారు. అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. అక్కడి స్థానికులతో మాటామంతీ ఉంటుంది. రాత్రిబోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి అవుతారు. పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటీఅనంతరం పేరూరు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు.