గిడుగు రామమూర్తి కృషివల్లనే ఆ కాలంలో ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు, రచన అనేవి వాడుక భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష దినోత్సం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుభాష అభివృధ్ధి, వ్యాప్తి కోసం తన జీవితాంతం కృషి చేసిన గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి, పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది టీడీపీయేనని అన్నారు. అలాగే ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ అన్న పాటను వినడానికి కూడా ఇష్టపడని వైసీపీ పాలకుల నుంచి తెలుగు భాషను కాపాడుకుంటామన్నారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండిః విద్యాసంస్థల పునఃప్రారంభంపై టీ-సర్కార్ కీలక ఆదేశాలు !