పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. భీమ్లా నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని ఆయన అన్నారు. తాను భీమ్లా నాయక్ సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానని అన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల విషయంలో సీఎం వైఎస్ జగన్.. ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేయటం ద్వారా రాష్ట్రాన్ని భిక్షాటన చిప్పగా మార్చాలనుకుంటున్నారని మండిపడ్డారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదని ఆయన అన్నారు. అయితే, భీమ్లా నాయక్ అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నానని నారా లోకేష్ పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement