కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని అక్రమంగా మట్టిని తరలిస్తున్న మట్టి మాఫియాను అడ్డుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పై దాడి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేశ్ మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామని చెబుతూనే, ఇప్పటికే చాలామందిని అంతమొందించారు వైసీపీ నేతలు అని ఆరోపించారు. పోలీసులు, అధికారుల అండతో ప్రజలు, ప్రతిపక్షనేతలు, ప్రజాసంఘాల నేతల్ని టార్చర్ చేశారని మండిపడ్డారు. ఏకంగా జేసీబీతో దాడి చేయడం రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని అన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు యత్నించిన గడ్డం గ్యాంగ్ మట్టిమాఫియా అరాచకాలు పోలీసులకి పట్టవా? అని ప్రశ్నించారు. ఈ రోజు రెవెన్యూ అధికారులపైకి వచ్చిన జేసీబీ పోలీసులపైకీ రాదన్న గ్యారెంటీ ఉందా? అని నిలదీశారు. మట్టిమాఫియాని అడ్డుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై జేసీబీతో దాడి చేసిన గడ్డంగ్యాంగ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల దాడుల్నించి ప్రభుత్వ సిబ్బంది, అధికారులకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు.
గడ్డం గ్యాంగ్ మట్టిమాఫియా.. జేసీబీ పోలీసులపైకీ రాదన్న గ్యారెంటీ ఉందా?
Advertisement
తాజా వార్తలు
Advertisement