ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రోజుకో అమానవీయ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని లోకేష్ అన్నారు. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు, బాధలు ఎవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. గుంటూరు ఎటి అగ్రహారంలో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కి పడేలా చేసిందన్నారు. దిశ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని తెలిసే ఇలాంటి ఘటనకి కానిస్టేబుల్ పాల్పడ్డాడా! అనే అనుమానం కలుగుతోందని తెలిపారు. ఇంత దారుణానికి పాల్పడిన వాడికి 21 రోజుల్లో శిక్ష వెయ్యకుండా కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని, సమాజానికి జగన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు.
ఇది కూడా చదవండిః ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు