Friday, November 22, 2024

ఏపీలో మహిళలకు రక్షణ కరువు.. ష‌ర్మిల‌, సునీత‌ల‌కే భ‌ద్ర‌త‌లేదు!

ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయిందంటూ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ‘’శ‌వాల‌పై పేలాలు ఏరుకునేవారిని త‌ల‌ద‌న్నుతూ అత్యాచారాల‌పైనా కోట్లు దండుకుంటున్నారు జ‌గ‌న్‌రెడ్డి. త‌న‌ ఇంటి ప‌క్క‌నే గ్యాంగ్ రేప్ జ‌రిగి 10 రోజుల‌వుతున్నా నిందితుల్ని ప‌ట్టుకోని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. దిశ యాప్ డౌన్‌లోడ్ నెపంతో సొంత‌ ప‌త్రిక‌కు కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌లిచ్చారు. సొంత అక్కాచెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీత‌ల‌కే భ‌ద్ర‌త‌లేక ఒక‌రు తెలంగాణ‌లో, ఇంకొక‌రు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. `అక్కచెల్లెమ్మ‌ల భ‌ద్ర‌త‌-జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ బాధ్య‌త‌` అంటూ ఎందుకీ క‌ప‌ట ప్ర‌క‌ట‌న‌లు జ‌గ‌న్‌రెడ్డీ?’’ అని లోకేష్ ప్రశ్నించారు.

‘’మీ ఇంటి ప‌క్క‌నే గ్యాంగ్ రేప్ జ‌రిగితే, నిందితుడూ మీ ఇంటిచుట్టూ తిరుగుతుంటే ప‌ట్టుకోలేని చేత‌గాని ద‌ద్ద‌మ్మ ముఖ్య‌మంత్రీ.. క‌రోనా బాధితుల డిమాండ్ల సాధ‌న‌కు చంద్ర‌బాబు చేప‌ట్టిన‌ దీక్ష‌ని పక్కదారి పట్టించేందుకు, 2020లో ఆమోదం పొందని దిశ చట్టం కోసం అప్పుడే ఆరంభించిన యాప్‌కే మరోసారి డౌన్ లోడ్ కార్య‌క్ర‌మ‌మా?’’ అని లోకేష్‌ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement