Thursday, November 21, 2024

ప్ర‌శ్నిస్తే సీఐడీ అరెస్టులు.. ఎదిరిస్తే ఏసీబీ దాడులు..

ఏపీలో నియంత పాలన సాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద్శి నారా లోకేష్ మండిపడ్డారు.నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. నియంత కంటే ఘోరంగా ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ ప‌ట్టించుకోకుండా, త‌న కక్ష తీర్చుకోవ‌డానికే ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న దేశంలో ఏకైక మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు.

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుని అరెస్ట్ చేస్తే, జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారుపై విశ్వాసం లేద‌ని 5 కోట్ల ఆంధ్రులూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నారని పేర్కొన్నారు. వారంద‌రినీ అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్య‌లు చేశారని..వై కేట‌గిరి భ‌ద్ర‌త‌లో వుంటూ ఇటీవ‌లే బైపాస్ స‌ర్జ‌రీ చేసుకున్న సొంత పార్టీ ఎంపీని ఆయ‌న పుట్టిన‌రోజు నాడే అరెస్ట్ చేయించ‌డం జ‌గ‌న్‌ రెడ్డి సైకో మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌నం అని పేర్కొన్నారు. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్ (CID) కాస్తా సీఎం ఇండివిడ్యువ‌ల్ డిపార్ట్‌మెంట్ గా మారిపోయిందని ఆరోపించారు. ‘’ప్ర‌శ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేర‌క‌పోతే జేసీబీతో ధ్వంసం,లొంగ‌క‌పోతే పీసీబీ త‌నిఖీలు.ఇదీ నియంత సైకో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌’’అంటూ మండిపడ్డారు. జగన్ అసమర్థతను ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారా లోకేష్ తెలిపారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు?!

Advertisement

తాజా వార్తలు

Advertisement