Tuesday, November 26, 2024

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం.. డాక్టర్ కుటుంబానికి లోకేష్ ఓదార్పు

గుండెపోటుతో కన్నుమూసిన డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ విశాఖలో పరామర్శించారు. విశాఖ సీతమ్మధారలోని డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్లిన లోకేశ్…ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే వేధిస్తారా అని ప్రశ్నించారు. నిరంతరం ప్రజలకు సేవ చేసే వ్యక్తి డాక్టర్‌ సుధాకర్‌‌ పై అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధించారని ఆరోపంచారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదన్నారు.

జగన్ రెడ్డి దళితులను,దళిత మేధావులను వెంటాడి,వేధించి,చంపేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఆయన సీఎం జగన్ రెడ్డి కాదు శాడిస్ట్ జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. దళిత డాక్టర్ సుధాకర్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని అన్నారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ జగన్ బలితీసుకున్నాడని విమర్శించారు. మాస్క్ ఇవ్వమని అడిగినందుకు ఈ శాడిస్ట్ ప్రభుత్వం సుధాకర్ పై కక్ష కట్టిందని ఆరోపించారు. నడి రోడ్డుపై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించారని, .పిచ్చోడనే ముద్ర వేసారని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ హై కోర్టుకి నివేదిక అందజేసిందన్నారు. న్యాయం జరిగే లోపే ఆయన చనిపోవడం బాధాకరం అని చెప్పారు. డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే ఆయన కుటుంబానికి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే కాబట్టి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం కుటుంబానికి అందజేయ్యాలని లోకేష్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement