టీడీపీ నేత దేవినేని ఉమపై సీఎం జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వైసీపీ అరాచకపాలన, మైనింగ్ మాఫియా, అవినీతి-అక్రమాలు-ఆగడాలకు అడుగడుగునా అడ్డుపడున్నారనే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించారని విమర్శించారు. దేవినేనిపై దాడిచేసిన నిందితులను ఐపీసీ సెక్షన్లు కింద కేసులుపెట్టి, అరెస్ట్ చేయాల్సిన పోలీసులు… ఉల్టా ఆయనపైనే వైసీపీ సెక్షన్ల కింద కేసులుపెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధితుల్ని నిందితుల్ని చేసిన దుర్మార్గమైన పోలీసు వ్యవస్థ ఏపీలో వుండటం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఒక మాజీ మంత్రినే చట్టవ్యతిరేకంగా ఇంతగా హింసిస్తుంటే..సామాన్యుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘’చట్టాన్ని చుట్టం చేసుకున్న పోలీసులూ! తాడేపల్లి కొంప కనుసైగలే చట్టంగా నిర్ణయాలు తీసుకున్న మీ బాస్‌కి పట్టిన గతే…మీకూ తప్పదు.. కొద్దిగా టైము పడుతుందంతే. చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తున్నా…న్యాయం ముందు దోషులుగా నిలబడక తప్పదు’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: దేవినేని ఉమ అరెస్టులో హైడ్రామా.. మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు