Wednesday, November 20, 2024

పదవి కోసం ఇంత దిగజారిపోవాలా?: డీజీపీపై లోకేశ్ ఫైర్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు విమర్శలు చేశారు. డీజీపీ పదవి కోసం ఇంతగా దిగజారిపోవాలా? సవాంగ్ గారూ… అంటూ ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను తాడేపల్లి ప్యాలెస్ కు తాకట్టు పెట్టడం మీ కెరీర్ లో మాయనిమచ్చలా మిగిలిపోతుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. దిశ చట్టాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్న జగన్ ను వదిలేసి, విపక్షాలపై ఏడుస్తారెందుకని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేల కామక్రీడలకు బలైపోయిన మహిళల ఫిర్యాదుపై స్పందించమంటే.. నీళ్లు నములుతారేంటి సార్? అని నిలదీశారు. “మీరు షాడో హోంమంత్రి సజ్జల వద్ద పనిచేస్తున్న గుమాస్తా కాదు… రాష్ట్ర డీజీపీ అని గుర్తుంచుకోండి. దిశ చట్టం ఇంకా చట్టబద్ధం కాలేదని సీఎంకు, మంత్రులకు అవగాహన కల్పించండి. వారంతా నిందితులకు ఉరిశిక్ష వేసేశాం అని పగటి కలలు కంటున్నారు” అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండిః విజయసాయి సింహాచల దర్శనంపై వివాదం.. సంప్రోక్షణ చేయాలని డిమాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement