Saturday, November 23, 2024

అన్న‌దాత‌ను ఆదుకోని జ‌గ‌న్ ఎందుకంటూ లోకేష్ ఫైర్

క‌ర్నూలు – తెలుగుదేశం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర క‌డిమెట్ల‌లో కొన‌సాగింది.. ఈ సంద‌ర్భంగా అకాల‌వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన పంట‌ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు.. క‌డిమెట్ల శివారులో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతుల‌ను పరామర్శించారు. రెండెకరాల మొక్కజొన్న వేస్తే పెట్టుబడి రూ.50వేలు, కౌలు రూ.40వేలు కలిపి రూ.90వేలు పెట్టుబడి అయితే, ఇప్పటిదాకా రూ.9వేలు దిగుబడి వచ్చిందంటూ రైతులు త‌మ బాధ‌ను నారా లోకేష్ కు విన్న‌వించారు.. ఈ సంద‌ర్బంగా నారా లోకేష్ మాట్లాడుతూ, అకాల వర్షాలకు ఏరువచ్చి పంట కొట్టుకుపోతే పట్టించుకునే నాథుడు లేడ‌ని,. అన్నదాతల వద్దకు వచ్చి కనీసం స్వాంతన చేకూర్చలేని ప్రభుత్వం ఎందుకు అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్ర‌శ్నించారు. ఏ రైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే సమాధానంగా వస్తున్నాయ‌న్నారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు ఘోరంగా దెబ్బతింటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేద‌న వ్యక్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement