అమరావతి: 15 లక్షల మంది విద్యార్ధులను పరీక్షల పేరుతో ఇబ్బందిపాలు చేస్తున్న జగన్ నిజంగా కంసుడేనని అన్నారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. ఈ మేరకు ఆయన వరుసగా ట్విట్లు చేశారు.. పరీక్షలు నిర్వహించేందుకే కట్టుబడి ఉన్నామని జగన్ చేసిన ప్రకటనను లోకేష్ తప్పు పట్టారు.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న దశలో కేంద్రం, దాదాపు అన్ని రాష్ట్రాలూ పరీక్షలు రద్దు, వాయిదా వేస్తే, ఒక్క ఏపీలోనేపరీక్షలు నిర్వహిస్తామని మొండిగా ముందుకెళ్లడం జగన్‌రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జగన్‌రెడ్డి అధ్వానపాలనలో వారు బతికి ఉంటే కదా భవిష్యత్తు? అని మండిపడ్డారు. అంబులెన్సులు రావని, ఆక్సిజన్ లేదని, జనం పిట్టల్లా రాలిపోతున్నారని అన్నారు. కరోనా శవాలతో మార్చురీలు నిండిపోయాయని చెప్పారు. అంత్యక్రియలకు శ్మశానాలలో క్యూలు ఉన్నాయని, ఆస్పత్రిలో బెడ్డు దొరక్క రోడ్డుపైనే కుప్పకూలిపోతున్నారని తెలిపారు.ఇవన్నీ పట్టించుకోకుండా పరీక్షల పేరుతో 15 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం ఫ్యాక్షన్ సీఎంకి తగదని లోకేష్ అన్నారు. కాగా, టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తున్నామని, విద్యార్ధులెవరూ అధైర్యపడవద్దని తెలిపారు..
విద్యార్ధుల పాలిటి కంస మామ జగన్ – నారా లోకేష్….
By sree nivas
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- EXAMS
- Guntur City News
- Guntur Local News
- guntur news
- Guntur News Telugu
- Guntur News Today
- Guntur Telugu News
- jagan
- NARA LOKESH
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement