Monday, November 25, 2024

దిశ చట్టం అంటూ జగన్ బిగ్గరగా అరవడం తప్పా ఏం లాభం: నారా లోకేశ్

గుంటూరులో రమ్య అనే బీటెక్ విద్యార్థిని దారుణ హత్య కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విద్యార్థి హత్య నిరసనగా విపక్షాలు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నాయి. తాజాగా రమ్య హత్య పై స్పందించిన నారా లోకేష్ వైసీపీ పై జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం రక్షణ కల్పిస్తారని విమర్శించారు. దిశ చట్టం అంటూ జగన్ బిగ్గరగా అరవడం, వైసీపీ బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు అని లోకేశ్ వ్యాఖ్యానించారు. సీఎం ఇంటి పక్కన, సొంత నియోజకవర్గంలోనూ మహిళలపై అత్యాచారాలు జరిగితే ఇప్పటిదాకా నిందితులను పట్టుకోలేకపోవడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే గుంటూరులో దళిత యువతి రమ్యను ఓ మృగాడు అత్యంత కిరాతకంగా హత్యచేశాడని లోకేశ్ వెల్లడించారు.బంగారు భవిష్యత్ పొందాల్సిన రమ్య జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం బాధాకరమని, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రమ్యను హత్య చేసిన మృగాడికి కఠినశిక్ష పడాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ఆఫ్ఘన్ యువతులపై దాడులు చేయడం లేదు: తాలిబన్ ప్రతినిధి సుహైల్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement