Saturday, November 23, 2024

జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కనబెట్టాలి: లోకేష్

పోలీసు అధికారుల సంఘాన్ని తన పైకి ఉసిగొల్పడానికి చూపించిన శ్రద్ధ మహిళల రక్షణ కోసం చూపించాలని నారా లోకేష్ సీఎం జగన్ ని విమర్శించారు. మీ పాలనలో మహిళలపై శ్రద్ధ పెట్టి ఉంటే రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కనబెట్టి మహిళల భద్రతపై దృష్టి పెట్టాలని లోకేశ్ హితవు పలికారు.

ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో బలైన సంగతి తెలిసిందే. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రానికి విడిచిపెట్టారు. ఆ సందర్భంగా నారా లోకేశ్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. 21 రోజుల్లోగా రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే తాము తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని లోకేశ్ హెచ్చరించారు.తాజాగా ఈ అంశంపై లోకేశ్ మరోసారి స్పందించారు. తాను విధించిన డెడ్ లైన్ కు ఇంకా 14 రోజులే మిగిలున్నాయని స్పష్టం చేశారు. విద్యావంతురాలైన రమ్యని హత్యచేసిన వాడికి ఉరి ఎప్పుడు? అని ప్రశ్నించారు.కాగా, ఏపీ పోలీసు అధికారుల సంఘాన్ని తనపైకి ఉసిగొల్పుతున్నారని లోకేశ్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి :Chiru 154: ముఠామేస్త్రి లుక్ లో చిరు హంగామా..

Advertisement

తాజా వార్తలు

Advertisement