ఏపీలో పరీక్షల రద్దుపై ప్రభుత్వం దిగి వచ్చే వరు పోరాడుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు పరీక్షలు రాయాలో, లేక ప్రాణాలు కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు కరోనా బారినపడినట్టు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదని, పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement