Sunday, December 22, 2024

AP | రామకుప్పం మండలంలో నారా భువనేశ్వరి విస్తృత పర్యటన..

కుప్పం, (ఆంధ్రప్రభ ): ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ తో కుప్పంలో అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమని నారా భువనేశ్వరి అన్నారు. గత ఐదేళ్ల పాలనలో చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సామర్థ్యం చంద్రబాబుతోనే సాధ్యమని భావించి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు.

మూడ‌వ రోజు కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలంలో నారా భువనేశ్వరి విస్తృతంగా పర్యటించారు. మొద్దులవంక గ్రామం, గాంధీనగర్ లో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజలాపురంలోని కస్తూర్బా పాఠశాలను భువనేశ్వరి సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

కుప్పం అభివృద్ధిపై చంద్రబాబు నిత్యం ప్రత్యేక చొరవ..

చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కుప్పం గురించే మాట్లాడుతూ ఉంటారని నన్ను గెలిపించి ఇంతవాణ్ణి చేసిన కుప్పం ప్రజల రుణం తీర్చుకోవాలని అంటుంటారని అయన సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. గత ఐదేళ్లూ కుప్పంలో అభివృద్ధి అనే మాట లేకుండా చేశారని మీరు చంద్రబాబు ను మళ్ళీ గెలుపించు కుని అభివృద్ధికి బాటలు వేసుకున్నారని ఆమె అన్నారు.

- Advertisement -

రాబోయే ఐదేళ్లలో అభివృద్ధిలో కుప్పం దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని కుప్పం ప్రజల బాధ్యత మాదన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టారని.. మీరు ఆయనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తెలిపారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటారని అన్నారు.

అదేవిధంగా మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మహిళలు తమకు అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడాలని చంద్రబాబు ఎప్పుడూ కోరుకుం టారని ఆమె తెలిపారు .అందుకే డ్వాక్రా స్థాపించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.

చంద్రబాబు 8 సార్లు గెలిపించి మీ అక్కున చేర్చుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు . మీకు ఎంతచేసినా తక్కువే అని పేదలకు ఇళ్లు నిర్మిస్తాం,డ్రైనేజ్ , తాగునీటి సమస్యలు తీరుస్తామన్నారు . బీసీ, మైనారిటీ వర్గాలకు కమ్యూనిటీ హాల్ నిర్మించబోతున్నామని తెలిపారు.

విద్యార్థులతో కలిసి నారా భువనేశ్వరి సహపంక్తి భోజనం

రామకుప్పం మండలం విజలాపురంలోని కస్తూర్భా విద్యాలయాన్ని నారా భువనేశ్వరి సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. బాగా చదువుకుని ప్రయోజకులై తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థినులు కంపెనీలు నడిపే స్థాయికి ఎదగాలన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యాచారాలు తగ్గాయని, గంజాయి రక్కసిపై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు గారు కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. స్కూల్ లో అభివృద్ధి పనులపై వినతిపత్రం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement