Friday, November 22, 2024

నారా, నందమూరి కుటుంబాల సంక్రాంతి సందడి

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : సంక్రాంతి సంబరాలు జరుపుకోడానికి మూడేళ్ల విరామం తరువాత నారా – నందమూరి కుటుంబాలు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారి పల్లెకు చేరుకున్నాయి. 2019లో చివరి సారిగా ఈ రెండు కుటుంబాలు ఇక్కడే సంక్రాంతి జరుపుకున్నారు. గ్రామస్థులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తిరిగి అదే విధంగా రెండు కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సారి ఈ రెండు కుటంబాల్లో నారా దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. నారావారి పల్లెలో దేవాన్ష్ చేస్తున్న సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నారావారి పల్లెలో నేటి నుంచి సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ రోజు నారా – నందమూరి కుటుంబ సభ్యులు పాండురంగయ్యగారి పల్లెలో గ్రామస్థులతో కలిసి విందులో పాల్గొన్నారు. అక్కడే ప్రత్యేకంగా కార్యక్రమాలను ఖరారు చేసారు. నారావారి పల్లెలో దేవాన్ష్ సందడి ఆసక్తిగా మారింది. స్థానికంగా ఉన్న వారితో కలిసి దేవాన్ష్ పాలు పితికిన ఫొటోలు వైరల్ గా మారాయి. తొలుత చంద్రబాబు, తరువాత భువనేశ్వరి, లోకేశ్ ఇప్పుడు బ్రాహ్మణి కూడా హెరిటేజ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దేవాన్ష్ పాలు పితకటం పైన ఆసక్తి చూపించటంతో హెరిటేజ్ కు వారసుడు సిద్ధం అవుతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement